![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -249 లో... కావ్య మొహం చూడడానికి కూడా ఇష్టం పడడం లేదు రాజ్. అందుకే కావ్య రాగానే రాజ్ వెళ్ళిపోవాలని అనుకుంటాడు. నేను కావాలని నిజం దాచలేదని కావ్య చెప్పే ప్రయత్నం చేసిన రాజ్ వినిపించుకోడు. ఇన్ని రోజులు నువ్వు అబద్ధం చెప్పవని మా అత్తతో వాదించాను. అలా అన్న ప్రతిసారీ నన్ను వెర్రివాడిని చేశావ్. మమ్మల్ని చూసి బాగా నవ్వుకునే దానివి కదా అంటూ కావ్య బాధపడేలా రాజ్ మాట్లాడుతాడు.
మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చొని ఇంటిపెద్ద గురించి బాధ పడుతుంటారు. కావ్య కాఫీ తీసుకొని వచ్చినా ఎవరు తీసుకోరు. అప్పుడే ఇందిరాదేవి ఇంట్లో ఉన్న ఆస్తి పేపర్స్, నగలు, డబ్బులు తీసుకొని హాల్లోకి వస్తుంది. నా భర్తని ఎలాగైనా కాపాడండి. నాకు పెళ్లి అయి ఇన్ని సంవత్సరాలు అయిన ఇంక భర్త చాటు భార్యనే. నాకు బయట సమాజం తెలియదు. మీరు ఏదిగిన వారు అన్ని ఎరిగిన వారు. నా భర్తని కాపాడండని ఇందిరాదేవి ఇంట్లో వాళ్ళని వేడుకుంటుంది. మరొక వైపు కళ్యాణ్ కి అనామిక ఫోన్ చేస్తుంది. కళ్యాణ్ లిఫ్ట్ చెయ్యడు.
మళ్ళీ మళ్ళీ అనామిక ఫోన్ చేస్తుంది అయిన కళ్యాణ్ లిఫ్ట్ చెయ్యాడు.. మరొక వైపు ఈ ఆస్తి, డబ్బులు ఖర్చు పెట్టి నా భర్తని కాపాడండని ఇందిరాదేవి అనగానే.. ఎంత ఖర్చు పెట్టిన ఆస్తి కరిగిపోవడమే గాని ఏం ప్రయోజనం లేదు. ఆ అవకాశం ఉంటే రాజ్ పెద్ద అన్నయ్య ఈ పని ఎప్పుడో చేసేవాళ్ళు కాదా అని రుద్రాణి అనగానే.. అందరూ షాక్ అవుతారు.. ఇందిరాదేవి మాత్రం కోపంగా.. రుద్రాణి చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవీ, అపర్ణ కలిసి రుద్రాణికి గట్టిగానే ఇచ్చుకున్నారు. ఆ తర్వాత తాతయ్యని ఎలాగైనా కాపాడుతానని రాజ్ మాట ఇస్తాడు.
మరొక వైపు అప్పు డల్ గా ఉండడంతో.. ఏమైంది అలా ఉందని అన్నపూర్ణని కనకం అడుగుతుంది. ఏమైందో తెలుసుకుంటే తెలుస్తుందని అన్నపూర్ణ అంటుంది. అయిన దానికి ఏం అవుద్ది దాని మనసులో ఎవరున్నారు తెలుసుకోవడానికి, మగ రాయుడు అని కనకం అంటుంది. అప్పుడే అప్పు దగ్గరికి అనామీక వస్తుంది. కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు. ఇంటికి వెళదామంటే సిచువేషన్ బాగా లేదు. అందుకే నీ దగ్గరికి వచ్చానని అప్పు ఫోన్ నుండి కళ్యాణ్ కి అనామిక ఫోన్ చెయ్యగానే.. కళ్యాణ్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. నేను చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. అప్పు చేస్తే లిఫ్ట్ చేశావని అనామిక ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అనామికకి కల్యాణ్ సారీ చెప్తాడు. కళ్యాణ్ మీ ఫ్రెండ్ షిప్ కీ చాలా వాల్యూ ఇస్తాడని అప్పుతో అనామిక అంటుంది. మరొక వైపు సీతారామయ్య దగ్గరికి రుద్రాణి ఖాళీ పత్రాలు తీసుకొని వచ్చి సీతారామయ్యని కాకా పడుతుంది. ఇక తరువాయి భాగంలో కావ్య చేసిన వంట తిననని మొండికేసి కూర్చొని ఉంటాడు రాజ్. ఆ తర్వాత కావ్య కావాలనే అపర్ణకి వినపడేల ఆయన భోజనం చెయ్యలేదు. ఎవరు చెప్పిన వినట్లేదు అనగానే.. రాజ్ నా మాట వింటాడు అని అపర్ణ భోజనం తీసుకొని వెళ్లి రాజ్ కి తినిపిస్తుంది. ధాన్యలక్ష్మి, కావ్య ఇద్దరు చాటుగా ఉండి రాజ్ తినడం చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |